ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీ రద్దు అయింది . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీ రద్దుకు  ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి అసలు కారణమని తెలుస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం లోని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఇటీవల గవర్నర్ సమక్షం లో  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన విషయం తెల్సిందే . ఈ సమావేశం లో షెడ్యూల్ 9, 10 లోని సంస్థల ఆస్తుల  పంపాకాలపై చర్చ జరిగినట్లు సమాచారం .


9, 10 షెడ్యూల్ లోని సంస్థల్లో నగదు ను రెండు రాష్ట్రాలకు పంచడానికి సిద్ధపడిన కేసీఆర్ , స్థిర ఆస్తులు మాత్రం కేవలం తెలంగాణ కే చెందుతాయని వాదించారట . కేసీఆర్ వాదన తో సమావేశం లో పెద్దగా విబేధించని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , అనంతరం న్యాయనిపుణలతో సంప్రదింపులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది . అయితే షెడ్యూల్ 9, 10లోని సంస్థల స్థిరాస్థులు కూడా  ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం చెందుతాయని న్యాయ నిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది . రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తాను స్నేహాస్తం అందిస్తుంటే , కేసీఆర్ మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని ఏపీ అన్యాయం చేయాలని చూస్తున్నారని గ్రహించిన జగన్ , రెండు రాష్ట్రాల సీఎస్ ల భేటీ కి వెళ్లాల్సిన అవసరం లేదని తమ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి తేల్చి చెప్పినట్లు సమాచారం .


జగన్ కు  రాజకీయ అనుభవం తక్కువ అని , తాను ఏది చెప్పిన ఓకే చెబుతాడని కేసీఆర్ భావించే, తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా షెడ్యూల్ 9, 10 సంస్థల్లోని ఆస్తుల పంపకం పై నగదు నిల్వలు పంచేందుకు రెడీ అయి , స్థిరాస్తుల పంపకానికి నో చెప్పి ఉంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . షెడ్యూల్ 9, 10 సంస్థల్లో నగదు నిల్వలు 20 వేల కోట్ల రూపాయల ఉండగా , స్థిరాస్థులు మాత్రం రెండు లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు . దీనితో కేసీఆర్ అసలు రంగు గ్రహించిన జగన్ , సీఎస్ ల భేటీ పై విముఖత ప్రదర్శించారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: