ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు చంద్రబాబు నాయుడికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటోంది.  బాబుపై జగన్ కక్షసాధింపు చర్యలను తీసుకుంటున్నారని, బాబుకు కావాలనే భద్రతా సిబ్బందిని తగ్గించారని వార్తలు వచ్చాయి.  అయితే, బాబు భద్రత విషయంలో జగన్ చిన్నచూపు చూడలేదని స్పష్టం అవుతున్నది.  


ప్ర‌భుత్వం త‌మ విష‌యంలో రాజ‌కీయం చేస్తుంద‌ని.. స‌రైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌టం లేదంటూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన ప‌రిస్థితి. అయితే, దీని గురించి ఏపీ సర్కారు చెప్పిన సమాధానం అందరికి షాక్ ను ఇచ్చింది.  బాబు పిటిషను కోర్టులో విచార‌ణ‌కు రావడంతో బాబు భ‌ద్ర‌త లెక్క‌పై ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు కొన్ని వివరాలు సమర్పించారు. 


ఆయన ఏం చెబుతున్నరాంటే రూల్స్ ను ఎక్క‌డా బ్రేక్ చేయ‌కుండా భారీ ఎత్తున భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేశామని... నిబంధ‌న‌ల ప్ర‌కారం బాబుకు 58 మంది భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే,  బాబుకు ఏపీ ప్ర‌భుత్వం ఏకంగా 74 మంది సిబ్బందిని నియ‌మించిందని న్యాయవాది వెల్లడించారు. 


బాబుకు భద్రత తగ్గించారని తెలుగుదేశం పార్టీ వాదిస్తుంటే.. లేదు భద్రతను గతంలో కంటే ఎక్కువ ఇచ్చామని చెప్పడంతో అందరు షాక్ అవుతున్నారు.  కావాలంటే దీనిపై ప్రత్యక్షంగా విచారణ జరిపి తెలుసుకోవచ్చని కోర్టుకు చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: