ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అధికారం కోల్పోయి సరిగ్గా రెండు నెలలు కూడా కావడం లేదు.. అంతలోనే ఆయనకు సీఎం కుర్చీపై ఆశలు పెరిగిపోతున్నాయి. ఇంతలోనే వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం అంటూ ఆయన పార్టీ నేతలతో చెప్పేస్తున్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందంటూ కామెంట్లు చేస్తున్నారు.


కుప్పంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో చంద్రబాబు ఈ కామెంట్లు చేశారట. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను చైతన్యం చేస్తున్నాయని చంద్రబాబు చెప్పారట. పింఛన్లు, విత్తనాలు, విద్యుత్‌ను సమయానికి ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారట.


గత ఐదేళ్లూ తాను రాష్ట్రం కోసమే పనిచేశానని.. ఇకపై పార్టీ కోసం పనిచేస్తానని చంద్రబాబు నేతలకు చెప్పారట. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ నేతల్లో ధైర్యం నింపారట. మరి జగన్ నెలన్నర కాకముందే కౌంట్ డౌన్ మొదలైందని చెప్పడంలో ఆంతర్యం ఏంటి.. ఇందంతా పార్టీని కాపాడుకునే ప్రయత్నమా..?


అసలే ఏమాత్రం అవకాశం దొరికిన టీడీపీని ఖాళీ చేయాలని బీజేపీ గోతి కాడ నక్కలా కాచుకుని కూర్చున్నవేళ.. పార్టీ నేతలు జంప్ కాకుండా.. టిడిపి నేతలను భ్రమలలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా.. లేక.. నిజంగానే ఆయన మళ్లీ తామే అధికారంలోకి వచ్చేస్తామని..ఇంత తక్కువ సమయంలో నమ్మకం కలిగిందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: