టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత ఇప్పుడు ఆ పార్టీలో లోకేష్ పెత్తనాన్ని ఒప్పుకొనే పరిస్థితిలో  ఎవరు లేరు. కాపు నేతలైతే లోకేష్ అధికారాన్ని టీడీపీలో ఒప్పుకోమని.. ఆయన కు బాధ్యతలు అప్పగిస్తే వైదొలుగుతామని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన లోకేష్ కేంద్రంగా గడిచిన ప్రభుత్వంలో తెరవెనుక పనులు కాంట్రాక్టులు ఒప్పందాలు జరిగాయన్న ప్రచారం బాగా జరిగింది.


వైసీపీ దీన్నే ప్రధానంగా హైలెట్ చేసింది. అయితే ఇప్పుడు లోకేష్ తోపాటు బాబు పార్టీ కూడా గెలవలేదు. దీంతో లోకేష్ పై విమర్శల జడివాన కురుస్తోంది.తాజాగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్న లక్ష్మీపార్వతి కూడా లోకేష్ బాబు పై లక్ష్మీ బాంబ్ విసిరారు.. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే ముందు లోకేష్ ను పక్కనపెట్టాలని సలహా ఇచ్చింది.


మహిళలను కించపరిచేలా మాట్లాడిన లోకేష్ వ్యాఖ్యలే కొంపముంచాయని.. లోకేష్ మరోసారి  మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.లోకేష్ ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుందని.. టీడీపీ బాగుపడాలంటే లోకేష్ ను దూరం చేయాలని లక్ష్మీపార్వతి స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: