2018 అక్టోబర్ నుండి 2019 మే దాకా కొనసాగిన ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగభృతి పథకం 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలవడంతో జూన్ నెల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగట్లేదు. ఈ పథకం ఇప్పటికే రద్దయినట్లు ఇక ముందు ఈ పథకాన్ని కొనసాగించే ఉద్దేశంలో ప్రస్తుత ప్రభుత్వం లేనట్లు వార్తలు వస్తున్నాయి. కానీ గత కొన్నిరోజులుగా నిరుద్యోగ భృతిని రాజన్న భృతిగా మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
సీఎం జగన్మోహన్ రెడ్డిగారు నిరుద్యోగభృతిని 3000 రుపాయలకు పెంచారని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఈ భృతిని ఇవ్వబోతున్నారని, నిరుద్యోగులతో పాటు గ్రామ వాలంటీర్లుగా నియమించబడేవారికి కూడా ఈ నిరుద్యోగభృతిని ఇవ్వబోతున్నారని రాజన్న భృతి వెబ్ సైట్ కూడా అతి త్వరలో చేయబోతున్నారని గత మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కానీ అసలు నిజం ఏమిటంటే ఈ పథకం అమలు చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైతే లేదు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం గ్రామ వలంటీర్ల నియామకాన్ని మాత్రమే చేపట్టబోతుంది వైసీపీ ప్రభుత్వం. ఈ గ్రామ వలంటీర్ల నియామకం తప్ప భృతి ఇవ్వాలనే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికైతే లేదు.ఎవరో కావాలని ఇలాంటి వార్తలు పుట్టించారు తప్ప ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: