వైసీపీ లో జగన్ తర్వాత ఆ స్థాయిలో పవర్ ఫుల్ లీడర్ విజయసాయిరెడ్డే.. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కాకపోతే.. ఆయన ఎంపీ కావడంతో, ఢిల్లీ స్థాయిలో ఆయన వ్యవహారాలు చక్కబెట్టే అవసరం ఉండటంతో మంత్రి పదవి వంటి లాంఛనాలు దక్కలేదు.


అందుకే ఆ లోటు భర్తీ చేసేలా.. విజయసాయిరెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించేందుకు కొన్నిరోజుల క్రితం జగన్ ఓ పదవి కట్టబెట్టారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. దీంతో విజయసాయిరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. అధికార లాంఛనాలు దఖలు పడ్డాయి


అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సర్కారు రద్దు చేసింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 68ని క్యాన్సిల్ చేస్తూ మళ్లీ జీవో విడుదల చేసింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.


విజయసాయిరెడ్డి వంటి కీలక నేతకు పదవి ఇచ్చే విషయంలో ఒకటికి, రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మరి జగన్ ఎందుకు ఈ విషయంలో అతి తక్కువ సమయంలోనే ఈ నిర్ణయాన్ని రద్దు చేశారన్నది చర్చనీయాంశమైంది. తాజా నిర్ణయం కారణంగా విజయసాయికి కేబినెట్ హోదా ర్యాంకు లేనట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: