జగన్ అధికారంలో వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు అందరికి షాక్ ఇస్తున్నాయి.  అభివృద్ధి అజెండాగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇతర పార్టీల నుంచి వైకాపాలోకి వచ్చేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని చెప్తుండటంతో.. ఆ పార్టీలోకి రావడానికి జంకుతున్నారు.  


దీంతో అందరి చూపులు బీజేపీవైపు ఉంటున్నాయి.  తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది బీజేపీలో చేరుతున్నారు.  తెలుగుదేశం పార్టీని అణిచివేయడానికి మాత్రం బీజేపీ కంకణం కట్టుకుంది.  అందుకే వచ్చే వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి స్వగతం పలుకుతుంది.  


జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ నుంచి ఇప్పట్లో ఎవరు వేరే పార్టీలోకి వెళ్ళరు.  అయితే, వైకాపా తరపున నరసాపురం నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు ఇటీవలే మోడీని కలిసి మాట్లాడారు.  ఎందుకు మోడీని కలిశారు అనే దానిపై క్లారిటీ లేదు.  


మోడీని కలవడం వెనుక కారణాలు ఉన్నాయని, ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం.  బీజేపీ మూలాలు ఉన్నా.. రఘురామకృష్ణం రాజు.. తెలుగుదేశం పార్టీలో చేరారు.  కానీ, సీటు రాదనీ తెలుసుకున్న రఘురామకృష్ణం రాజు, తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో జాయిన్ అయ్యారు.  నరసాపురంనుంచి పోటీచేసి గెలుపొందారు.  కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే మోడీని కలిసినట్టు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: