తాను కోరిన ఐ ఏ ఎస్ అధికారుల డిప్యుటేషన్ పై  కేంద్రం చేస్తోన్న  జాప్యం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది . తన వారి కోసం ఎంత దూరమైన వెళ్లే మనస్తత్వం కలిగిన జగన్ , ఈ వ్యవహారం లో కేంద్రం తో తాడో, పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం .  తెలంగాణ క్యాడర్ కు చెందిన స్టీఫెన్ రవీంద్ర , శ్రీలక్ష్మిలతోపాటు , కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డి ని ఏపీ డిప్యుటేషన్ పై బదిలీ చేయాలని , ఇటీవల ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసి జగన్ కోరారు . అమిత్ షా కూడా జగన్ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించడం తో , ఇక ముగ్గురు అధికారులు ఏపీ కి డిప్యుటేషన్ పై బదిలీ కావడం ఖాయమని జగన్ భావించారు .


కానీ ముగ్గురు ఐ ఏ ఎస్ అధికారుల డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డి ఓ పి టీ ) అభ్యంతరాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది . ఈ ముగ్గుర్ని ఏపీ కి డిప్యుటేషన్ పై బదిలీ చేస్తే , భవిష్యత్తు లో మరికొంతమంది తమ సొంత రాష్ట్రాలకు వెళ్తామని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని,  డి ఓ పి టీ  ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి , ధర్మారెడ్డిల బదిలీ వ్యవహారం ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది .


 వైఎస్ హయం స్టీఫెన్ రవీంద్ర , శ్రీలక్ష్మి , ధర్మారెడ్డిలు కీలక బాధ్యతలు నిర్వహించారు . వీరిని ఏపీకి  బదిలీ చేయించుకొని , కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు . ఈ మేరకు తమను ఏపీ కి బదిలీ చేయాలని ముగ్గురు ఐ ఏ ఎస్ అధికారులు దరఖాస్తులు చేసుకున్నారు . ఏకంగా స్టీఫెన్ రవీంద్ర సెలవులపై కూడా వెళ్లారు . శ్రీలక్ష్మి , వైఎస్ ప్రభుత్వం లో గనుల శాఖ కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు . అదే సమయం లో వెలుగు చూసిన ఓబుళాపురం మైనింగ్ అక్రమాల్లో,  ఆమె పాత్ర కూడా ఉందన్న కారణంగా జైలు జీవితాన్ని అనుభవించారు  శ్రీలక్ష్మి. గతం లో శ్రీలక్ష్మి జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని భావిస్తోన్న జగన్ , ఆమెను ఏపీ బదిలీ చేయాలని పట్టుబడుతున్నారు . అయితే ఈ వ్యవహారం ఆలస్యం కావడం పట్ల జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: