మైహోమ్ గ్రూప్ సంస్థ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు... ఇప్పుడు తెలంగాణలో కీలకమైన పారిశ్రామిక వేత్త.. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న వ్యక్తి.. ఇప్పుడు ఆయన సంస్థలపైనా ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది.

మై హోం గ్రూపునకు చెందిన అన్ని కార్యాలయాలు, నివాసాల్లో ఐటి దాడులు జరగటం ఆసక్తిరేపుతోంది. ఇవి రొటీన్ ఐటీ దాడులా లేదా.. రాజకీకయంగా ప్రేరేపితమైన దాడులు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో కేసీఆర్ కూడా మోడీకీ దూరం పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

దీనికితోడు ఇటీవల మైహోం గ్రూపు మీడియా రంగంలోనూ ప్రవేశించింది. మీడియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. టీవీ9 సంస్థతో పాటు మరికొన్ని మీడియాలను హస్తగతం చేసుకుంది. ఈ కారణంగా ఈ గ్రూపుకు రాజకీయంగానూ ప్రాముఖ్యత పెరిగింది.

మరో కీలక విషయం ఏమిటంటే.. లోక్ సభ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో ఇంత భారీ ఎత్తున ఐటి దాడులు జరగటం ఇదే మొదటిసారి. కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తుగడా లేక.. సాధారణంగా వ్యాపార, పారిశ్రామిక సంస్థల్లో జరిగే ఐటీ దాడులేనా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: