కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన  మహిళా మంత్రిగా  నిర్మల సీతారామన్  చరిత్ర సృష్టించారు. ఈ రికార్డు అప్పట్లో ప్రధానమంత్రిగా ఉంటూనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరున ఉంది. 

 

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 'ముద్ర యోజన' దేశంలో సామాన్యుల జీవితాన్ని మార్చేసిందని తెలిపారు. నిర్మాణ రంగంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చామనీ, దీంతో ఏడాది కాలంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల మేర బలపడిందని చెప్పారు. 

 

కేంద్రంలో రెండో దఫా మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మల సీతారామన్‌కు కీలకమైన పదవిని ఇచ్చారు. గత టర్మ్‌లో ఆమెకు రక్షణ శాఖను కేటాయించారు. ఈ దఫా ఆమెకు ఆర్థిక శాఖను కేటాయించారు.

2019 బడ్జెట్ లోని ముఖ్యాంశాలు :

- ఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు

- లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం

- ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన

- సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు

- ‘జల్ వికాస్ మార్గ్’ పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత

- 3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం ‘ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం’

- ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులు

- సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు

- దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం

- విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు

మరింత సమాచారం తెలుసుకోండి: