కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలను ఆమె అభినందించారు.

 

డ్వాక్రా మహిళలకు రూ.5000 వరకూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని 18 దేశాల్లో రాయబార కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించామనీ, వాటిలో ఐదింటిని ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. ఇదే క్రమంలో మహిళలకు షాక్ ఇచ్చారు.

 

మహిళలు ఎంతగా ఇష్టపడేది బంగారం..ఇప్పుడు ఆ బంగారంపై కస్టమ్స్ చార్జీలను పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో బంగారం ధరలు పెరగనున్నాయి.  వాస్తవానికి పెళ్లిళ్ల సీజన్, పండుగ సీజన్ లో పెరిగేది ఇప్పుటి నుంచే బాదుడు మొదలవుతుంది. ఈ బడ్జెట్‌లో బంగారంపై  కస్టమ్స్‌ రుసుము పెంచుతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. 

 

బంగారంపై కస్టమ్స్ రుసుమును 10 నుండి 12.5 శాతానికి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.  దీంతో బంగారం, వెండి ధరలు పెరగనున్నాయి. నిర్మల సీతారామన్ మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపే బంగారం ధరలు పెరిగేలా ట్యాక్స్ వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: