బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్ర ప్రదేశ్ కు రిక్త హస్తాన్ని చూపించింది కేంద్రం . నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం ఏపీ ప్రజలను విస్మయానికి గురి చేసింది . ఇక సాగునీటి ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ లో  పెద్దగా కేటాయింపులు లేకపోవడం పై అధికార వైకాపా నేతలు పెదవి విరుస్తున్నారు . ఏపీ లోని సెంట్రల్ యూనివర్సిటీ కి 13 కోట్లు , గిరిజన యూనివర్సిటీ కి 8 కోట్లు కేటాయించిన కేంద్రం , నిట్ , ఎం ఐ ఎం , ఐ ఐ టి లకుమాత్రం  మొండి చెయ్యి చూపించింది .


కేంద్ర బడ్జెట్ పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పెదవి విరిచారు . బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు . ఈ బడ్జెట్ లో ఏపీ  ఎన్ని నిధులు కేటాయిస్తున్నారన్న దానిపై స్పష్టత లేదన్న ఆయన, బడ్జెట్ లో  ఏపీ అదనంగా లభించింది ఏమి లేదని అన్నారు . విభజన చట్టంలోని హామీల ప్రస్తావనే బడ్జెట్ లో లేకపోవడం విస్మయాన్ని కలిగించిందని  విజయసాయి అన్నారు .


రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు దిశగా  కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు . ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ లో నిలదీస్తామన్న ఆయన, ఏపీ కి జరిగిన అన్యాయం పై ఏ పోరాటానికైనా సిద్ధమేనని చెప్పారు . కేంద్ర బడ్జెట్ పై రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీ లు పెదవి విరుస్తున్నారు . బడ్జెట్ లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమి లేదని చెబుతున్నారు . విభజన చట్టం లోని ఏ ఒక్క హామీ గురించి బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు .


మరింత సమాచారం తెలుసుకోండి: