ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేసినట్టయితే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇస్లాం మత పెద్ద, ఇరాన్‌ నేత అయాతుల్లా ఖొమైనీ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్‌ మంత్రి మహమూద్‌ అలావీ తెలిపారు. ' ఇరాన్‌ సైనికశక్తిని చూసి అమెరికా భయ పడి ఉంటుంది. అందుకే, ఇరాన్‌పై దాడి చేయాలని తొలుత నిర్ణయించుకొని ఆతర్వాత వెనక్కి తగ్గింది' అని అలావీ అన్నారు. ఇరాన్‌ గగనతలంలో అమెరికా నిఘా డ్రోన్‌ సంచరించడాన్ని ఆయన ఖండించారు.

 

ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడంతోనే నిఘా డ్రోన్‌ను పేల్చామని అన్నారు. ఇరాన్‌ ఆర్థికవ్య వస్థను దెబ్బతీయాలని అమెరికా కుట్ర పన్నిందన్నారు. అందుకే, అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడమే కాకుండా, ఇతర దేశాలపై కూడా ఒత్తిడి పెంచిందన్నారు. ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్‌ సర్కార్‌ కన్నెర చేస్తోందని విమర్శించారు. భారీ ఆంక్షలు మోపినప్పటికీ ఇరాన్‌ తలొగ్గే ప్రసక్తేలేదని అలావీ తెలిపారు.

 

ఇరాన్‌ నుంచి సిరియాలోని బన్యాస్‌ చమురుశుద్ధి కర్మాగారానికి బయల్దేరిన నౌకను స్పెయిన్‌ సముద్ర జలాల్లో సీజ్‌ చేసినట్టు బ్రిటన్‌ నావికాదళం వెల్లడిం చింది. యూరోపియన్‌ యూనియన్‌ ( ఈయూ) ఆంక్ష లను ఉల్లంఘించిన నేపథ్యంలో జిబ్రాల్టర్‌ ప్రాంతంలో చమురు నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపింది. ఇరాన్‌లోని బాండర్‌ అస్సాలుయే ఓడరేవు నుంచి నౌక బయల్దేరినట్టు అనుమానిస్తు న్నామని పేర్కొంది.

 

బ్రిటిష్‌ రాయల్‌ మెరైన్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...జిబ్రాల్టర్‌ ప్రాంతంలో భారీ చమురు నౌకను గుర్తించినట్టు కస్టమ్స్‌ అధికారులు, పోలీసులు సమాచారం అందించారు. ఈ నౌక ఇరాన్‌ నుంచి బయల్దేరినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో నౌకను అదుపులోకి తీసుకోవాలని బ్రిటన్‌ను అమెరికా కోరింది. ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ రహస్య మార్గాల్లో ఇతర దేశాలకు చమురు రవాణా జరుగుతోందని అమెరికా అనుమాని స్తున్నది. సిరియాలో2011లో అంతర్యుద్ధం చెలరేగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: