ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది.  అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలు కావడంతో అందరు ఆమోదిస్తున్నారు.  మరోవైపు పక్కరాష్ట్రం తెలంగాణాతో వైరాన్ని పక్కన పెట్టి.. స్నేహంగా ఉంటున్నారు.  


నీటి సమస్యల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కావలసిన సహాయ సహకారాలు చేసుకోవడానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణలో ఉంటున్నారు.  విభజన సమయంలో ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించుకున్నాడు.  విభజన సమయంలో కమల్ నాథ్ కమిటీ ఉద్యోగులకు ఆప్షన్ విధానం ఇచ్చింది.  


ఇందులో భాగంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొంతమంది ఉద్యోగులు ఆప్షన్ విధానం ద్వారా తెలంగాణాలోనే ఉండిపోయారు.  ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో ఆంధ్రా ఉద్యోగుల విషయంలో కెసిఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారు.  


ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులను తిరిగి ఆంధ్రప్రదేశ్ పంపించెయ్యాలని చూస్తున్నారు.  అలాగే అక్కడ ఉన్న తెలంగాణా ఉద్యోగులను తిరిగి తెలంగాణకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్.  కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రా ఉద్యోగులకు ఇక్కట్లు మొదలయ్యాయని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: