కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరు  మౌనంగా ఉన్నారు . బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు కనీస కేటాయింపులు చేయకపోయినా , ఇరువురు ముఖ్యమంత్రులు మౌనముద్ర వహించడం వెనుక ప్రధాని మోడీ వ్యవహారశైలినే కారణమని తెలుస్తోంది . కేంద్ర బడ్జెట్ పై స్పందించాల్సి వస్తే , విమర్శించడం తప్పా…  కేంద్రం , తమ రాష్ట్రానికి ఇది కేటాయించిందని చెప్పుకోవడానికి ఒక్క ప్రాధాన్యత అంశం లేదు.


బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయకుండా,  మనస్సులోనే అదిమి పెట్టుకుట్టున్నట్లు తెలుస్తోంది. తనకు గానీ , తన ప్రభుత్వానికి  వ్యతిరేకంగా మాట్లాడితే మోడీకి ఇష్టముండదని తెలిసే ఇరువురు సీఎం లు మౌనంగా ఉన్నారని , కనీసం బడ్జెట్ పై తమ అభిప్రాయాల్ని కూడా తెలియజేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తులు స్పందించకపోవడం విడ్డూరమని అంటున్నారు .


అయితే మోడీ సర్కార్ పై ఇప్పటికిప్పుడు విమర్శలు చేసి సాధించేదేమీ లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాము విమర్శించినంత మాత్రాన రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరిగే అవకాశం లేదని , సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడితే మంచిదన్న భావన లో ఉన్నట్లు సమాచారం . ఎన్నికల ముందు మోడీ ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే . దాంతో  మోడీ కి  కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . ఆ దూరాన్ని తగ్గించుకునేందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: