సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో మద్యపాన నిషేధం ముఖ్యమైనది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా రాష్ట్రంలో మధ్యపాన నిషేధం చేస్తానని ఫైవ్ స్టార్ హోటళ్ళలో తప్ప మరెక్కడా మధ్యం అందుబాటులో లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కోసం ప్రస్తుత ప్రభుత్వం మధ్యం అమ్మే సమయాన్ని తగ్గించబోతున్నట్లు తెలుస్తుంది. మధ్యపాన నిషేధం అమలు దిశగా వైసీపీ ప్రభుత్వం నుండి ప్రయత్నాలైతే మొదలయ్యాయి. 
 
సాధారణంగా ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల దాకా మధ్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్రంలో అక్టోబర్ నుండి అమలయ్యే ఎక్సైజ్ పాలసీలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే మధ్యం అమ్మటానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా మధ్యం అమ్మకాలు రాత్రి 7 గంటల తరువాతే ఎక్కువగా ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన మధ్యం సేవించే వారి సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంది. 
 
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రభుత్వానికి కూడా కొంతమేర ఆదాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమ్ముతున్న మధ్యం బ్రాండ్లను కూడా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తుంది. ఈ బ్రాండ్లను తగ్గించడం ద్వారా అమ్మకాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇచ్చిన హామీలను అతి తక్కువ సమయంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండటంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: