ప్రకాశం జిల్లా కు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యే కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊహించని ఝలక్ ఇచ్చారు . ఉద్యోగుల బదిలీల వ్యవహారం లో తన కేబినెట్ లోని ఐదు మంది  మంత్రులను పిలిచి క్లాస్ పీకిన జగన్ , ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను సైతం తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది . ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, పోలీస్ అధికారిని కోరుకున్న చోటకు బదిలీ చేయిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం .


ఈ విషయాన్నీ తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సదరు ఎమ్మెల్యేను తనవద్దకు పిలిపించుకుని , నేరుగా పోలీస్ అధికారి వద్ద బదిలీ చేయిస్తానని చెప్పి పది లక్షలు తీసుకున్న వైనం గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది . దాంతో బిత్తరపోయిన ఎమ్మెల్యే కు ఏమి సమాధానం చెప్పాలో పాలుపోక , తాను డబ్బులు తీసుకున్న విషయాన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది . సదరు పోలీస్ అధికారి వద్ద తీసుకున్న నగదును వెనక్కి ఇచ్చేస్తానని ఎమ్మెల్యే చెప్పడమే కాదు ... తిరిగి ఇప్పించినట్లు  తెలుస్తోంది .


ప్రభుత్వంలో ఎటువంటి అవినీతిని సహించనని జగన్మోహన్ రెడ్డి తాను పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చెబుతూ వస్తున్నారు . అయితే కొంతమంది మంత్రులు , ఎమ్మెల్యేలు మాత్రం ముఖ్యమంత్రి అలాగే చెబుతారు ... తాము ఏమి చేసినా చెల్లుతుందని భావిస్తూ వచ్చారు . కానీ ఉద్యోగుల బదిలీ వ్యవహారం లో అవినీతికి పాల్పడిన మంత్రులను , తాజాగా ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి క్లాస్ పీకడం పరిశీలిస్తే , అవినీతి నిర్మూలనకు తాను ఎంత నిబద్ధత తో   కట్టుబడి ఉన్నానో జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: