కర్ణాటకలో పెను రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాలతో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. రాజీనామా చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో సర్కారు కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


అయితే కప్పల తక్కెడగా మారిన ఈ రాజకీయం విలువ అక్షరాలా వెయ్యి కోట్లు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలకు రూ. వెయ్యికోట్లతో భాజపా ఎర వేస్తోందని జేడీఎస్ ట్విటర్‌ ద్వారా ఆరోపించింది. ఆ ట్వీట్ లో జేడీఎస్ ఏమని ఆరోపిస్తోందంటే...


"కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 1000కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం.. మిజోరం, మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌లో దాదాపు 10శాతానికి సమానం. మోదీ, అమిత్ షాలకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? అవినీతి రహిత పాలన అనేది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం. నిజం మాత్రం ఇదే!’


ఈ ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. కర్నాటక రాజకీయ సంక్షోభంతో తమకు ఏమాత్రమూ సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఆమాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అటు పార్లమెంటులోనూ ఈ అంశం ప్రకంపనలు రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: