మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కొత్త కొత్త పధకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.  పేదల కోసం ఈ పధకాలు ఉపయోగపడతాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇదిలా ఉంటె. ఈ సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీన మహాత్మాగాంధీ 150 వ జయంతోత్సవాలు జరగబోతున్నాయి.  


జయంతి ఉత్సవాల సందర్భంగా మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు.  దేశంలోని భాజాపా ఎంపీలు వారి వారి నియోజక వర్గాల్లో కనీసం 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అక్కడి ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలని ఆర్డర్స్ పాస్ చేశారు.  ఇలా చేయడం వలన ప్రజా సమస్యల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.  


ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటో తెలుసుకోవచ్చు.  అలానే ప్రజల్లో ఎంపీలపై గౌరవం పెరుగుతుంది.  డైరెక్ట్ గా ఎన్నికల సమయంలో వెళ్లి కలిస్తే ఓట్లు పడవు.  అందుకే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని మోడీ సూచించి ఉండొచ్చు.  కారణం ఏదైనా కావొచ్చు.  ఇలా చేయడం మంచిదే.  


లోక్ సభ ఎంపీలే కాకుండా రాజ్యసభ ఎంపీలు కూడా ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలనీ, పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు గురించి తెలుసుకోవాలని కోరారు.  ఇది మంచి పనే అని చెప్పాలి.  ఎంపీలంతా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: