తెలంగాణ సాధించిన తర్వాత ఇక్కడ పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుందని..ఇక కష్టాలు తొలగిపోతాయని భావించినప్పటికీ ప్రస్తుత పాలకుల తీరు గత పాలకులన్నా అధ్వాన్నంగా ఉందని ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. 

ఇటీవల ఇంటర్ బోర్డు అవకతవకలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా గప్ చుప్ గా ఉండటం..దాదాపు 25 మంది విద్యార్థులు చనిపోతే కనీస న్యాయం చేయకపోవడం ఎంత వరకు న్యాయం అని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, టీవీవీలు తదితర సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. బంద్ నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలలు, కాలేజీలు నేడు సెలవు ప్రకటించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: