గత కొంతకాలంగా ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్ ద్వారానే చెబుతున్నాడు నారా లోకేశ్. నారా లోకేశ్ ట్విట్టర్లో మాత్రమే ప్రశ్నించడంపై విమర్శలు వస్తున్నాలోకేశ్ వాటిని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రతిరోజు విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడిందని యువనేస్తం నిరుద్యోగభృతి పథకం, పసుపు కుంకుమ, రంజాన్ తోఫా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలను ప్రభుత్వం ఆపేసిందని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని లోకేష్ అన్నారు. 
 
అభివృధ్ధి, సంక్షేమ పథకాలను అందించడం అటుంచి, అధికారం దక్కిందనే గర్వంతో తెదేపా కార్యకర్తలు , సానుభూతిపరులపై దాడులు జరుపుతున్నారని ఐనా సంయమనం పాటించామని మా కార్యకర్తల సహనాన్ని చేతకానితనం అనుకోవద్దని లోకేశ్ అన్నారు. కానీ లోకేశ్ చేసిన విమర్శలకు ప్రజల నుండి మాత్రం స్పందన మరోలా ఉంది. లోకేశ్ చేసిన ట్వీట్లకు ప్రజల నుండే కౌంటర్లు పడుతున్నాయి. లోకేశ్ చెప్పినవి నిజాలు కావని ప్రజలు భారీగా స్పందిస్తున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ పథకాలు సరిగ్గా అమలు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయిందని లోకేశ్ నే జనాలు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా భారీగా గ్రామ వలంటీర్లను నియమించబోతున్నారని భృతి ఇవ్వటం కంటే ఇలా ఉద్యోగాలు కల్పించటం మేలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు ఏప్రిల్ 11 దాకా ఉన్న రుణాలన్ని వైసీపీ ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించబోతుందని పసుపు కుంకుమ కంటే ఇది మంచి పథకమని ప్రజలు ట్వీట్ల ద్వారా సమాధానం ఇస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: