ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావిస్తోంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను ప్రజల ముందు ఉంచి.. వాస్తవాలు చెప్పాలని భావిస్తోంది. అయితే ఇది కక్షసాధింపే అన్నవాదన కూడా వినిపిస్తోంది.


ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు స్వాగతించారు. ఈ పత్రాల ద్వారా ఏంచెబుతారో చూశాక తాము స్పందిస్తామంటున్నారు..

ఆయన ఏమన్నారంటే...

శ్వేతపత్రాలు విడుదల చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. అప్పుడు ఇప్పుడూ అధికారులు ఒక్కరే కదా.. వాస్తవాలు ప్రజలకు చెప్పి చర్చ జరిగేందుకు ఇదో మంచి అవకాశం. వారు ఏం చెప్తారో చూసి మేమూ స్పందిస్తాం.. మా పాలన బాగుంది కాబట్టే కేంద్రం అనేక అవార్డులు ఇచ్చింది..


రైతులకు సాగునీరు, విత్తనాలు ప్రజలకు తాగు నీరు నిరంతరం పర్యవేక్షించుకునేవాళ్ళం... అందుకే మా పాలనలో సమస్యలు తలెత్తలేదు.. కానీ ఇప్పుడు అది కొరవడింది.. గోదావరి కి వరద ఉన్నప్పటికీ పట్టిసీమ కు నీటి విడుదల లో జాప్యం జరిగింది.. దీనివల్ల రైతులు నష్టపోయారు.. పాలకులు- అధికారుల సమన్వయం లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి..


హంద్రీనీవా జలాలతో సీమ ప్రజల కళ్ళలో ఆనందం అనంతపురం పర్యటనలో కనిపించింది.. అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు.. జగన్ సర్కారు శ్వేతపత్రాల విడుదలపై స్పందించేందుకు సిద్ధం అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: