ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం శాసనసభ పక్షం భేటీ జరిగింది.


ఈ బేటీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెలసీలు, మాజీమంత్రులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. ప్రధానంగా మూడు అంశాలపై జగన్ సర్కారును ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.


అందులో మొదటిది.. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు.. రైతులు ఎదుర్కొంటున్న విత్తనాల అంశాన్ని మొదలుకొని పట్టిసీమ రైతుల సమస్యలు, ఇతర అంశాలపై చర్చకు తెలుగుదేశం పట్టుబడుతుంది. సర్కారును ఇరుకున పెట్టేందుకు ఇదే చక్కటి అవకాశంగా తెలుగుదేశం భావిస్తోంది. ఇక రెండో అంశం.. తెలుగుదేశం కార్యకర్తలు పై దాడుల అంశం. దీనిపై సభలో గట్టిగానే మాట్లాడాలని ఆ పార్టీ భావిస్తోంది.


ఇప్పటికే చంద్రబాబు బాధితులను ఓదార్చేందుకు జిల్లాల పర్యటనలు చేశారు. మూడోది.. టీడీపీ ఎమ్మెల్యేలకు అవమానం.. కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలను అవమానించారంటున్న తెలుగుదేశం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేదుకు కూడా సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: