ఈ మద్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనిషిలో వేలం వెర్రి పెరిగిపోతుంది.  మంచికి వాడాల్సిన టెక్నాలజీని చెడుకు వాడుతున్నారు.  ఈ మద్య టిక్ టాక్ అనే యాప్ తో రక రకాల అనుకరణలు చేస్తూ జనాల మెప్పు పొందడానికి కొంత మంది తెగ ట్రై చేస్తున్నారు.  ఈ యాప్ ద్వారా నవ్వుకోవడం పేరడీలు చేయడం..సాహసాలు చేసి అబ్బుర పర్చడం లాంటివి చేస్తున్నారు. 

కొంత వరకు ఇది ఎంట్రటైన్ ఇస్తున్నా కొందరి ప్రాణాలు మాత్రం హరిస్తుంది. టిక్ టాక్ మరొకరి ప్రాణం తీసింది.  ఇద్దరు అన్నదమ్ములు సరదా కోసం చేసిన ప్రయత్నం వారి కుటుంబంలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లాకి చెందిన యువకుడు నర్సింహులు, అతనికి వరుసకు సోదరుడైన ప్రశాంత్‌.. ఇద్దరూ కలిసి దూలపల్లి దుమార్‌ చెరువులో దిగారు.

ఫోన్ టిక్ టాక్ యాప్‌ను అనుసరిస్తూ నర్సింహులు చెరువులోకి దిగాడు. నర్సింహులుని ప్రశాంత్ వీడియో తీస్తున్నాడు.  కానీ అతనికి ఈత రాక మునిగిపోతుండగా భయపడి అక్కడ నుంచి ఊర్లోకి వచ్చి తెలిసినవారికి చెప్పడంతో వారు వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: