వైకాపాలో ఫైర్ బ్రాండ్ గా ఓ వెలుగు వెలిగిన రోజాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి.  వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రోజాకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది.  అందరికంటే ముందు మంత్రిగా రోజా పేరే వినిపించింది.  


మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. చివరికి వచ్చే సరికి ఆమెను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం కల్పించాడు జగన్.  దీంతో రోజాకు కోపం వచ్చి మంత్రి వర్గ ప్రమాణస్వీకారం సమయంలో అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ వెళ్ళింది.  రోజా అలిగిందని వార్తలు వచ్చాయి.  


దీంతో విజయసాయి రెడ్డి రోజాతో మంతనాలు జరిపి బుజ్జగించారు.  జగన్ ఆమెకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్ట్ ఇస్తున్నట్టు తెలిపారు.  దీంతో ఆమె కుదుటపడింది.  జగన్ పదవి గురించి చెప్పారుగాని, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఏవి రాకపోవడంతో అసంతుప్తితో ఉన్నట్టు సమాచారం.  


కాగా, తాజగా రోజాకు పదవికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలుస్తోంది.  కొన్ని కారణాల వలన రోజా పదవికి సంబంధించిన ఉత్తర్వులు ఆలస్యం అయ్యాయని ప్రభుత్వం తెలియజేసింది.  సో, రోజా పదవికి సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది.  పదవిలో అడుగుపెట్టిన తరువాత జబర్దస్త్ మాటేంది అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: