ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో అధికార, ప్రతి పక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగింది.  తాజాగా  2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రూ. 2,27,984 కోట్ల భారీ బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.


శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. దాదాపు 45 నిమిషాల పాటు బడ్జెట్ పై చర్చ జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దీనిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో బడ్జెట్‌ను సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మోపిదేవి వెంకట రమణ మండలిలో ప్రవేశపెడతారు. 


 అయితే షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ... సున్నా వడ్డీ రుణాలపై చర్చ నేపథ్యంలో సమయాన్ని మార్చారు. దాంతో ఈ రోజు మధ్యాహ్నం 12.22 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా,  శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో బొత్స సత్యనారాయణ, మండలిలో మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: