2011 లో వైకాపాను ఏర్పాటు చేసిన దగ్గరి నుంచి ఆ పార్టీతో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు.  2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున విజయం సాధించిన చాలామంది స్వలాభం కోసం వైకాపాను వదిలి టిడిపిలో జాయిన్ అయ్యారు.  ఇది వైకాపాకు కొంత ఇబ్బందిని కలిగించింది.  


2019 లో వైకాపా విజయం సాధించింది.  వైకాపా విజయం వెనుక జగన్ కృషి ఎంత ఉన్నదో తెలిసందే.  జగన్ తో పాటు దాని వెనుక రోజా కష్టం కూడా ఉంది.  కీలక సమయంలో పార్టీకి అండగా నిలబడింది.  పార్టీ తరపున తన బలమైన వాయిస్ ను వినిపించింది.  


ఎక్కడా బెదరలేదు.  వాయిస్ ను బలంగా వినిపించడంతో ఆమెను సభ నుంచి సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు.  సభలో లేకపోయినా.. బయట నుంచే ఆమె తన వాయిస్ ను వినిపించింది.  జగన్ స్థాపించిన పార్టీ కావడంతో ఆయన నెంబర్ 1 అందులో తిరుగులేదు.  ఇప్పుడు నెంబర్ 2ఎవరు అనే దానికి కొన్ని సమాధానాలు బయటకు వస్తున్నాయి.  


మొన్నటి వరకు నెంబర్ విజయసాయి రెడ్డి అనుకున్నా.. అది కాదని, నెంబర్ 2 ప్లేస్ లో రోజానే ఉంటుందని, ఆమైతేనే పార్టీకి తగిన బలాన్ని ఇవ్వగలుగుతుంది వార్తలు వస్తున్నాయి.  నెంబర్ 2 గొడవ ఇప్పుడు ఎందుకులే అనుకోవచ్చు.  అలా అనుకోబట్టే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా మారిందో అర్ధం అవుతున్నది.  మరి చూడాలి ఏమౌతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: