జగన్ పేరుతో అమ్మ ఒడి పథకాన్ని వచ్చే జనవరి 26వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు సభ్యుల హర్ష ధ్వానాల మధ్య ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ రూ.475 కోట్లు.. వైఎస్ బోర్ వెల్ పథకానికి రూ. 200 కోట్లు.. విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు.. అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు కేటాయించారు. ఇక వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ రూ.1,740 కోట్లు.. ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు కేటాయించారు.

వైఎస్సార్ గృహ వసతికి రూ.5 వేల కోట్లు పట్టణాల్లో ప్రధాని ఆవాస్ యోజనకు రూ.1370 కోట్లు.. బలహీన వర్గాల ఇళ్లకు రూ.1,280 కోట్లు.. వైఎస్ఆర్ అర్భన్ హౌసింగ్ కు వెయ్యి కోట్లు.. వైఎస్సార్ కల్యాణ కానుకకు రూ.300 కోట్లు.. వైద్య రంగానికే రూ.11,399 కోట్లు.. నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2,234 కోట్లు.. గృహనిర్మాణ శాఖకు రూ.3,617 కోట్లు.. అర్బన్ డెవలప్ మెంట్ కు రూ.6,587 కోట్లు కేటాయించారు.


కాపు కార్పొరేషన్ కు రెండు వేల కోట్లు.. జగన్ తన పాదయాత్రలో కాపు సంక్షేమం కోసం ప్రస్తుతం ఇస్తున్న నిధులకు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. దీని మేరకు ఈ బడ్జెట్ లో కాపు కార్పోరేషన్ కు రూ.2 వేల కోట్లు గా ప్రతిపాదించారు. ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు.. ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు రూ.500 కోట్లు.. వ్యవసాయానికి రూ.20,677 కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు.. విద్యుత్ రూ.6,861 కోట్లు.. రవాణా రూ.6,157 కోట్లు.. ఇండస్ట్రీ మినరల్స్ కు రూ.3,986 కోట్లు.. జనరల్ ఎకో సర్వీసెస్ రూ.6,025 కోట్లు సాధారణ విద్య రూ.32,618 కోట్లు..


వైద్యరంగానికి రూ.11,399 కోట్లు కోట్లు.. నీటి సరఫరా పారిశుద్ద్యానికి రూ.2,234 కోట్లు.. గృహ నిర్మాణ శాఖకు రూ.3,617 కోట్లు.. సంక్షేమ శాఖలకు రూ.14,142 కోట్లు.. సాధారణ సర్వీసులకూ రూ.66,324 కోట్లు.. హోంశాఖ రూ.7,461.92 కోట్లు.. మైనారిటీ సంక్షేమానికి రూ.952 కోట్లు.. ఎస్టీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ.4,988 కోట్లు.. ఎస్సీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ.15 వేల కోట్లు.. బీసీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ.15,061 కోట్లు.. నాయి బ్రాహ్మణులు,రజకులు,టైలర్లకు రూ.300 కోట్లు.. బ్రాహ్మణ సంక్షేమం కోసం వంద కోట్లు కేటాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: