సినిమా ఇండస్ట్రీలో ఆలీకి ఓ మంచి పేరుంది.  బాల్యనటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. అనేక సినిమాల్లో హీరోగా నటించాడు.  సహనటుడిగా మెప్పించాడు.  ఇప్పుడు టీవీ షోలో కార్యక్రమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టీవీ షోలు చేస్తూనే రాజకీయాల్లో బిజీ అయ్యారు.  


వైకాపాలో జాయిన్ అయిన ఆలీ.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు.  కానీ, జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.  ఏదో ఒక రోజు పదవి ఇస్తామని చెప్పారట.  వైకాపాకు అనేకమంది తెలుగు నటులు సపోర్ట్ చేశారు.  ఇందులో ఆలీ కూడా ఒకరు.  అయితే, ఆలీకి జగన్ ఓ హామీ ఇచ్చారని తెలుస్తోంది.  


అలీనీ ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి శాస‌న మండ‌లికి పంపాలని జగన్ భావిస్తున్నారట. అంతేకాదు త్వరలోనే దీనిపై జగన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని రాజకీయ వర్గాల సమాచారం.   ఇదే జరిగితే గత ఎన్నికల సమయంలో సపోర్ట్ చేసిన నటులు కూడా జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది.  


ఆలీ కి ఎమ్మెల్సీ పదవి కేవలం పుకార్లేనా లేదంటే నిజంగా ఇస్తున్నారా అన్నది తెలియాలి.  అధికారిక ప్రకటన ఇస్తారని అంటున్నారు కాబట్టి అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: