నేను విన్నాను.. నేనున్నాను.. ఇది యాత్ర సినిమాలో వైఎస్ పాత్రధారి మమ్ముట్టి చెప్పే డైలాగ్.. ఆ సినిమాలో ఆ సన్నివేశంలో ఈ డైలాగ్ చాలా ప్రభావం చూపించింది. వెయ్యి వాక్యాల భావాలని ఆ ఒక్క మాట హృదయాన్ని హత్తుకునేలా చెప్పేసింది.


అందుకే వైఎస్ జగన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఈ.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. డైలాగ్ ను చాలా బాగా వాడుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్ కు టీడీపీ కొనసాగింపుగా పేరడీ కౌంటర్ డైలాగ్ చెబుతోంది. బడ్జెట్‌లో నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్‌.. నేను తిన్నాను అని చెప్పుకుంటే కూడా బాగుటుంది అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.


ఏపీ బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ ఉందన్నారు యనమల. జగన్‌కు దశ ఉంది కాని.. దిశ లేదన్నారు. వడ్డీ లేని రుణాలపై హడావుడి చేసిన సీఎం.. కేవలం 100 కోట్ల రూపాయలే ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కేటాయింపుల్లో కోతలు పెట్టడాన్ని యనమల తప్పు పట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: