ఏపీలో చాలామంది టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల చాలా నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం నేతలు కూడా ఈ కోణంలో ఆలోచిస్తున్నారు.


మరో ఐదేళ్లు ఏ పదవీలేకుండా ఉండటం కంటే.. కేంద్రం అండతో ఏదో ఒక పోస్టు దక్కించుకోవచ్చన్న ప్లాన్ కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. గతంలోనే ఏపీ నేతలకు కేంద్రం పలు పదవులు ఇచ్చింది.


తాజాగా.. ఎపి బిజపి అదికార ప్రతినిది యడ్లపాటి రఘునాధబాబును పోగాకు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉన్నారు. గుంటూరులో ఈ బోర్డు కార్యాలయం ఉంటుంది.


అంతకుముందు.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా పదవి లో నియమించారు. మరో నేత విష్ణువర్దన్ రెడ్డిని నెహ్రూ యువక కంద్ర ఉపాద్యక్షుడిగా నియమించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: