బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తరువాత కొంత నిరాశలో ఉన్నారు.  బయోపిక్ బాగా వస్తుందని అనుకుంటే దారుణంగా ఫెయిల్ అయ్యింది.  ఈ సినిమా ద్వారా దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగా లాస్ అయ్యాడు.  ఇది బాలయ్యకు మింగుడు పడటం లేదు.  ఇప్పుడు సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.  


ఇందులో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.  ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ హీరో.. రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు.  హిందూపురం నుంచి వరసగా రెండోసారి బాలయ్య విజయం సాధించాడు.  ఇప్పుడు ఒక్క హిందూపురంలోనే కాకుండా బాలకృష్ణకు రాయలసీమలో మంచి పలుకుబడి ఉంది.  


గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమిపాలైంది.  కేవలం 23 సీట్లతో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  చంద్రబాబు తరువాత అంతటి ఛరిష్మా కలిగిన నేత ఎవరూ లేకపోవడంతో బాబుగారు ఇబ్బంది పడుతున్నారు.  


రాయలసీమలో బాలకృష్ణకు మంచి పేరుంది కాబట్టి బాలయ్యకు సీమ బాధ్యతలు అప్పగించాలని బాబుగారు అనుకున్నారట.  కానీ, బాలయ్య అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.  ప్రస్తుతం తన దృష్టిని సినిమాపైనే పెడుతున్నారని, ఇప్పట్లో పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఆయనకు లేదని అంటున్నారు.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: