దేశ వ్యాప్తంగా బీజేపీ తన హవాను కొనసాగిస్తోంది.  ఎక్కడైతే ఆ పార్టీ కాలుమోపలేదో అక్కడ దృష్టి సారించి కాలుమోపెందుకు రెడీ అయ్యింది.  ప్రస్తుతం బీజేపీ దృష్టి వెస్ట్ బెంగాల్ పై ఉన్నది.  గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది.  


మహామహులకే సాధ్యం కానీ చోట అడుగు పెట్టింది.  పార్లమెంట్ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించి మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు.  దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాగైనా విజయం సాధించి బెంగాల్ ను కైవసం చేసుకోవాలని చూస్తున్నది బీజేపీ.  


బీజేపీ పార్టీకి చెందిన ముకుల్ రాయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ , కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని పలువురు టీఎంసీ నేతలు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారని, ఆ పార్టీ విధానాలతో వారు విసుగుచెందారని అన్నారు.


పలువురు టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలోకి వచ్చి, వెంటనే తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముకుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీజేపీలో చేరారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: