ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని 1983 వ సంవత్సరంలో స్థాపించాడు.  స్థాపించిన అనతికాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పార్టీని స్థాపించాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయం అంటే ఏంటి ఎలా ఉంటుంది అనే విషయాలను ప్రజలకు చేరువయ్యేలా చేశారు. 


ఇదిలా ఉంటె గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది.  ఆ పార్టీకి చెందిన నేతలు చాలామంది పార్టీ మారారు.  వీరిలో సుజనా చౌదరి కూడా ఒకరు.  సుజనా చౌదరి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  సుజనా తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. 


ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీ నుంచి సుజనా చౌదరి బీజేపీలో జాయిన్ అయ్యాక, మొదటిసారి విజయవాడ వస్తున్నారు.   ఈ సందర్భంగా విజయవాడలో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి.  ఆ ఫ్లెక్సీలను చూసిన  ఎవరైనా సరే షాక్ అవ్వకతప్పదు .  


తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో పాటు మోడీఫోటో తో కూడిన బ్యానర్ వెలిసింది.  దాని కింద సుజనా చౌదరి ఫోటో ఉండటం విశేషం.  దీని అర్ధం ఏంటి.. తెలుగుదేశం పార్టీ మెల్లిమెల్లిగా బీజేపీగా మారబోతుందనేగా.. ఏమో ఏదైనా జరగొచ్చు.  చెప్పలేం కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: