వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పదవీ భాద్యతలు చేపట్టినప్పటినుండి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన జగన్ 2020 ఉగాది నాటికి ఇల్లు లేని పేదలకు ఇంటిస్థలం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇంటిస్థలాల కోసం కలెక్టర్లు దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డిగారు అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో స్థలం, గృహ నిర్మాణాల కోసం 8,600 కోట్ల నిధులు కేటాయించినట్లు జగన్ తెలిపారు. 
 
త్వరలో నియామకం కాబోతున్న గ్రామ వలంటీర్ల ద్వారా ఇల్లు లేని పేదల సంఖ్య తెలుస్తుందని ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని ఒకవేళ ప్రభుత్వ భూమి లేని పక్షంలో భూమిని కొనుగోలు చేయాలని జగన్ సూచించారు. కలెక్టర్లు ఈ ఇంటిస్థలాల కోసం ఇప్పటినుండే పని మొదలుపెట్టాలని 2020 ఉగాదిలోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని జగన్ అన్నారు. 
 
అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తున్నాం కాబట్టి కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డిగారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రంలోని పేదలందరికీ ఇంటిస్థలం లభించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళ ని నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: