మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కింగ్ మేకర్ అవుతుందని చాలా మంది ఊహించారు. అధికారం అందుకునేంత సీన్ లేకపోయినా.. కనీసం కుర్చీలో ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేసే ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ ఊహలన్నీ తలకిందులయ్యాయి.


చివరకు పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. ఒక్క రాజోలు స్థానంలో ఆ పార్టీ తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. కానీ ఇప్పుడు ఆ రాపాక కూడా జనసేనలో ఉంటాడన్న విశ్వాసం కలగడం లేదు.


తాజాగా ఆయన అసెంబ్లీలో జగన్ ను పొగిడిన తీరు చూస్తే.. ఆయన త్వరలోనే జెండా పీకేసేలా కనిపిస్తున్నారు. దేవుడు కోరితేనే వరాలు ఇస్తాడని.. కానీ జగన్ కోరని వారికి కూడా వరాలు అందించే దేవుడిలా కనిపిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను మించిన స్థాయిలో సాగిన రాపాక పొగడ్తలు చూస్తుంటే.. ఆయన జంపింగ్ ఖాయంగా కనిపిస్తోంది.


బడ్జెట్ తీరును ప్రశంశించిన రాపాక గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని అన్నారు. పంటల నష్ట పోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం హర్షణీయమని ఆయన అన్నారు. కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా మెచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: