ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అని కర్నూలు నగర ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ తెలిపారు. బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. ముస్లింలు అన్నివర్గాల కంటే వెనుకబడి ఉన్నారని, అందరికంటే దయనీయంగా బతుకుతున్నారని చెప్పారు.


ముస్లింల కష్టాలను పాదయాత్రలో వైయస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు కాబట్టే అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఉగాదిలోగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామనడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. ఆడవాళ్ల పేరు మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని, దానిపై పేదలకు పూర్తిగా అధికారం ఉంటుందన్నారు.


మైనారిటీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. నారా హమారా కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి హింసించారని, నంద్యాల ఉప ఎన్నికల్లో మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.


గత ప్రభుత్వ హయాంలో చదువుకు దూరంగా ఉన్న వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని హాఫీజ్ ఖాన్ అన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే రాజన్న బడిబాట, అమ్మ ఒడి పథకాలు ప్రవేశపెట్టడంతో డ్రాపౌట్స్‌ తగ్గించామన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: