ఏపీ మాజీ సీఎం, ప్ర‌స్తుత విప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు సోష‌ల్ మీడియాకు మ‌ధ్య చాలా పెద్ద అవినాభావ సంబంధ‌మే ఉంది. ఆయ‌న ఏం చేసినా.. త‌గిన‌విధంగా ప్ర‌చారం కోరుకుంటారు. ఆయ‌న ఎలాంటి నిర్ణ యం తీసుకున్నా.. ప్ర‌జ‌ల నుంచి జేజేలు అందుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. సోష‌ల్  మీడియాలో చంద్ర‌బాబుకు ఫాలోవర్లు భారీగానే ఉన్నారు. ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు, ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో ఉండ‌గా కూడా బాబుకు మంచి ఫాలో వ‌ర్లు ఉన్నారు. 


తాజాగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అక్ర‌మ‌క‌ట్ట‌డాల‌పై పెద్ద ఎత్తున ఉద్య‌మానికి తెర‌దీసిన‌ట్టు చెప్పింది. ఇక‌, ఈ క్ర‌మంలోనే తొలుత కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట వెంబ‌డి ఉన్న నిర్మాణాల‌ను తొల‌గిస్తున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జావేదిక‌ను కూల్చేశామ‌న్నారు. అయితే, దీనిపై స్పందించిన చంద్ర‌బాబు.. న‌దుల వెంబ‌డి, క‌ర‌క‌ట్ట‌ల వెం బ‌డి అక్ర‌మంగా నిర్మిస్తున్న వాటిని కూల్చివేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. గ‌త ప్ర‌భుత్వం మార్చిన చ‌ట్టాన్ని ఆయ‌న వెల్ల‌డిం చారు. 


అయితే, అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌త సుప్రీం కోర్టు తీర్పును స‌భ‌లో వెల్ల‌డించింది. ఈ తీర్పు ప్ర‌కారం.. వ‌ర‌ద ప్ర‌వాహానికి అడ్డు వ‌చ్చే ఏ నిర్మాణాన్న‌యినా అనుమ‌తించేది లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. దీనికి మ‌రోసారి చంద్ర‌బాబు స్పందించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వాద‌న‌ను ప‌క్క‌దారి ప‌ట్టించారు. అయితే, రోడ్ల‌కు మ‌ధ్య‌లో ఉన్న విగ్ర‌హాల వ‌ల్ల అనేక రోడ్డు ప్ర‌మా దాలు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని కూడా తొల‌గిస్తారా? అని ప్ర‌శ్నిస్తారు. నిజానికి జ‌రుగుతున్న చ‌ర్చ‌కు, చంద్ర‌బాబు వేసిన ప్ర‌శ్న‌కు సంబంధం లేక పోవ‌డంతో ఒక్క‌సారిగా స‌భ‌లో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. 


రాజ‌కీయంగా వాదోప‌వాదాల‌కు తెర‌దీసింది. బాబు ఉద్దేశం ప్ర‌కారం.. రోడ్ల‌కు మ‌ధ్యలో ఉన్న వైఎస్ విగ్ర‌హాల‌ను తొల‌గించాలి. అయితే, దీనికి ఇది అవ‌కాశం కాద‌ని తెలిసి కూడా ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌డంతో స‌భ మొత్తంఅట్టుడికింది. దీనిపై స్పీక‌ర్ కూడా ఒకానొక సంద‌ర్భంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌ట్ చేస్తే.. చంద్ర‌బాబు వాద‌న‌లో ప‌స‌లేదంటూ.. నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నిజానికి చంద్ర‌బాబుకు వైఎస్ విగ్ర‌హాల‌ను కూల్చాల‌ని ఉంటే.. వేరే రూపంలో చ‌ర్చ‌కు పెట్టి సాధించుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: