Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 5:06 pm IST

Menu &Sections

Search

చింత‌మ‌డ‌క శ్రీ‌మంతుడు కేసీఆర్‌...ఒక్క‌రోజే ఎన్ని రికార్డులు సృష్టించారంటే...

చింత‌మ‌డ‌క శ్రీ‌మంతుడు కేసీఆర్‌...ఒక్క‌రోజే ఎన్ని రికార్డులు సృష్టించారంటే...
చింత‌మ‌డ‌క శ్రీ‌మంతుడు కేసీఆర్‌...ఒక్క‌రోజే ఎన్ని రికార్డులు సృష్టించారంటే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంటింటా మామిడి తోరణాలు...బంతిపూల దండలు...ఇళ్ల‌ ముందు వెల్‌కమ్ టు సీఎం కేసీఆర్ అంటూ ముగ్గులు.. తమ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకడానికి సిద్ధమైన చిత్ర‌మిది. ఎక్క‌డ అనుకుంటున్నారా?రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో. ఎందుకు అనుకుంటున్నారా...గ‌త శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వెళ్లిన కేసీఆర్ ఈ సంద‌ర్భంగా చింతమడక గ్రామస్థులతో ``నేను మళ్లీ వస్తా.. అన్ని విషయాలను మాట్లాడుకుందాం.. మీతో రోజంతా గడుపుతా..`` అని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సొంతూరుకు కేసీఆర్ వెళుతున్నారు. అందుకే.


విభిన్న‌మైన రాజ‌కీయాలు, ప‌రిపాల‌న‌కు సుప‌రిచితులు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే ఒర‌వ‌డిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. త‌న సొంత ఊరు చింత‌మ‌డ‌క చ‌రిత్ర‌ను మార్చేలా శ్రీ‌మంతుడి అవ‌తారం ఎత్త‌నున్నారు. కేసీఆర్‌తో ఈ గ్రామానికి గుర్తింపు వచ్చింది. చరిత్ర పుటల్లో చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన నేత ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ర్టాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ నేడు త‌న సొంతూరుకు రానుండటంతో గ్రామస్థులు మహా సంబురపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 


ఇప్పటికే గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులు దాని ప్రకారం ప్రతిపాదనలను రూపొందించారు. మాజీమంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ ఆదివారం గ్రామంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించి గ్రామస్థులతో సమావేశమయ్యారు. కేసీఆర్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఉద‌యం  10.30 గంటలకు చింతమడక గ్రామానికి చేరుకుంటారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారు. గ్రామంలో కలియదిరుగుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లుచేశారు. 


ఇది కేవలం సీఎం కేసీఆర్ సొంతూరు గ్రామస్థులతో మమేకమయ్యే పర్యటన అయినందున ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ఇందుకోసం 3200 మంది గ్రామస్థులకు ప్రత్యేకంగా తయారుచేయించిన పింక్ కలర్ ఐడీ కార్డులను అందించారు. వీరంతా ఐడీ కార్డులతో సభాస్థలికి చేరుకుంటారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. 200 మంది అధికారులకు వైట్ గుర్తింపుకార్డులు, 200 మంది మీడియా ప్రతినిధులకు గ్రీన్ గుర్తింపుకార్డులను అందించారు. మొత్తంగా ఆరువేల మందికి భోజనాలను ఏర్పాటుచేస్తున్నారు. ఐకేపీ గోదాము వద్ద రెయిన్‌ప్రూఫ్ టెంట్‌ను నెలకొల్పారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటుచేశారు. అధికారులు, మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ ఉంటుంది. 60 మంది కూర్చొనేలా వేదిక రూ పొందించారు. వేదికకు కుడివైపున గ్రీన్ హౌస్ ను ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం భోజనాలకోసం మహిళలకు, పురుషులకు ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మ గుడి పక్కనే రెయిన్‌ప్రూఫ్ టెంట్ వేశారు. పెద్దమ్మ గుడి ముందు చింతచెట్టు వద్ద గద్దెను కూడా నిర్మించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, సీఎం కేసీఆర్ త‌న ఊరిలో అడుగుపెట్ట‌డానికి ముందే...రూ.10 కోట్ల‌ను గ్రామానికి కేటాయించారు. వివిధ ప‌థ‌కాల కింద నిధులు ప్ర‌క‌టించారు. ఇక తాజా స‌మావేశంలో ఆయ‌న ఎన్ని ప్ర‌త్యేకత‌లు న‌మోదు చేస్తారో వేచి చూడాల్సిందే.


kcr-telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోదీకి కోలుకోలేని దెబ్బ‌...18 రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు ముఖ్యులు...
అరుణ్‌జైట్లీ క‌న్నుమూత‌...ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన బీజేపీ దిగ్గ‌జం
క‌శ్మీర్‌కు రాహుల్ బృందం..ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా
హైద‌రాబాద్ వేదిక‌గా క‌శ్మీర్ జ‌పం..ప‌టేల్‌కు ప్ర‌శంస‌లు..అమిత్‌షా ప్ర‌త్యేక‌త ఇది
ఇంకో ప్రాజెక్టుపై కేసీఆర్ ఫోక‌స్‌...మూడు షిఫ్టులు చేయాల‌ని ఆర్డ‌ర్‌
వైసీపీపై ఫిర్యాదులో జ‌న‌సేన పేర్కొంది ఇదే
వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో గోల్‌మాల్‌...విజ‌య‌సాయిరెడ్డి జోక్యంతో...
వైసీపీపై డైరెక్ట్ అటాక్...పోలీసుల‌కు జ‌న‌సేన ఫిర్యాదు
ఆ రాష్ట్రంలోకి ఆరుగురు టెర్ర‌రిస్టుల ఎంట్రీ...దేశంలో హై అల‌ర్ట్ ఎందుకో తెలుసా?
తల ఒక‌చోట‌...మొండెం మ‌రోచోట..హైద‌రాబాద్ నడిబొడ్డున దారుణహ‌త్య‌
100 ప్రశ్న‌లు...చిదంబ‌రంపై సీబీఐ ప్ర‌శ్న‌ల వ‌ర్షం
 కిష‌న్‌రెడ్డిని బుక్ చేసిన కేటీఆర్‌...డిఫెన్స్‌లో ప‌డ్డ‌ట్లేనా?
అమిత్‌షా ప్ర‌తీకారం...జైలు గోడ‌ల్లో చిదంబ‌రం..ఏం జ‌రిగిందంటే...
తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌....311 ఉద్యోగాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌
ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి..సీబీఐ క‌స్ట‌డిలోకి చిదంబ‌రం!
ఆ న‌ర‌హంత‌కురాలి వ‌ల్లే ఇలా జ‌రిగిందా? చిదంబ‌రం అరెస్టు వెనుక ఆమె..!
జ‌గ‌న్ మాట నిరూపించుకున్నాడుగా..అసెంబ్లీ ఉదంతంపై  తొలివేటు
ఈడీ ఉచ్చులో రాజ్ థాక‌రే...ముంబైలో 144 సెక్ష‌న్‌
చిదంబ‌రం అరెస్ట్‌...కిష‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
తెలుగు రాష్ట్రాల నాయ‌కులకు గుడ్ న్యూస్‌...నిరీక్ష‌ణ ఫ‌లించ‌నుంది
అడ‌వుల‌పై కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం...మూడేళ్ల‌లోనే మారిన సీన్‌
మ్యాన్‌హోల్లో ప‌డ్డ చిన్నారి...జ‌ల‌మండలి నిర్వాకం
క‌శ్మీర్‌కు చిదంబ‌రం అరెస్ట్‌కు లింక్‌...త‌న‌యుడి కొత్త లాజిక్‌
హైద‌రాబాద్‌కు మ‌రో మ‌ణిహారం...అమెజాన్ అతిపెద్ద క్యాంప‌స్‌
చిదంబ‌రం అరెస్ట్‌...రాత్రంతా అక్క‌డే
చిదంబరానికి తెలుగు జ‌డ్జీ షాక్‌...అరెస్ట్ త‌ప్ప‌దు
కృత్రిమ అడ‌విలో....క‌లెక్ట‌ర్ల‌కు కొత్త ప్ర‌పంచం చూపించిన సీఎం కేసీఆర్..!
చిదంబ‌రం చేతికి బేడీలు...ఏక్ష‌ణ‌మైనా...
బ‌య‌ట నోరు తెర‌వ‌ద్దు...మీటింగ్ ముచ్చ‌ట్లు చెప్ప‌ద్దు..కేసీఆర్ ఆర్డ‌ర్‌
వైద్య‌సేవ‌ల‌కు ఓకే...ఆరోగ్య‌శ్రీ‌తో ఆగిపోయిన సేవ‌లు పునఃప్రారంభః
మోడీ స్కెచ్ స‌క్సెస్‌..ఇమ్రాన్ ఖాన్ త‌లంటిన ట్రంప్‌
బొత్సాతో ఆ మాట‌ల‌ను చెప్పించింది జ‌గ‌నే క‌దా?
మ‌రో వివాదంలో కంగ‌నా..చీర‌తో ఆమె మొద‌లుపెట్టింది మ‌రి
అమ్మాయిల‌ను అనుభ‌వించాడు...4000 కోట్ల ఆస్తి దానం..ఆఖ‌రికి ఎలా మ‌ర‌ణించాడంటే
చంద్ర‌యాన్ 2 ...సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన ఇస్రో
అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ మాయం...కోడెల ఇంటికి చేరింద‌ట‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.