Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 9:31 pm IST

Menu &Sections

Search

గుంటూరోళ్ల గీర గురించి గుంటూరోడు రాసిన అద్భుత పోస్టు..!

గుంటూరోళ్ల గీర గురించి గుంటూరోడు రాసిన అద్భుత పోస్టు..!
గుంటూరోళ్ల గీర గురించి గుంటూరోడు రాసిన అద్భుత పోస్టు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాదో ప్రత్యేక స్థానం. ఇక్కడి జనం కాస్త తేడాగా ఉంటారని గుంటూరు వాసులే చెబుతున్నారు. కాస్త పొగరుగా, గీరగా తమదైన శైలితో ఉంటారంటూ గుంటూరు వాసి ఇండస్ మార్టిన్ రాసిన ఫేస్ బుక్ పోస్టు ఆద్యంతం ఆసక్తిరంగా ఉంది. మీరూ చదవండి..


" మా గుంటూరు ఒక వూరు కాదు, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అస్థిత్వం అని నా అనుమానం. ఇక్కడ పుట్టిన మనుషులు ఎవడికి వాడు చాలా బడాయిగా సహజంగా ఇండియా మొత్తాన్నీ ఏలేస్తాం అని ఫీల్ అవుతారు కానీ నిజానికి అలా వాళ్ల చేత మాట్లాడించేది గుంటూరే అని నా ప్రఘాఢ న్నమ్మక్కం. గుంటూరు తన అస్థిత్వాన్ని కలకాలం కాపాడుకునే ఏర్పాట్లలో భాగంగా ఆ గడ్డన పుట్టిన ప్రతీ మనిషీ, కుక్కా, బర్రె, ఆటో, సిటీ బస్సులో తనదైన ఒక రెటమతాన్ని నింపుతుంది. దాని ప్రభావంగా పైన చెప్పిన గుంటూరు కణాలన్నీ పైత్యంగా, మిడిసిపాటుగా... ఇలాంటి లక్షణాలన్నీ కలిపి అదొక రకమైన గీర ప్రవర్తనతో ఎల్లప్పుడూ కకావికలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.


ఈ ప్రవర్తనకు విధ్య, ఐశ్వర్యం, ఎన్నారై హోదా ఏదీ మినహాయింపును ఇవ్వలేదు. కోబాల్డ్ పేట మూడో లైన్లో రేకుల షెడ్డులో ఉండే ఆటో ఏడుకొండలూ, వాషింగ్టన్ డీసీ లో ఉండే తాతినేని శ్రీనివాసరావు ఉర్ఫ్ మిష్టర్ తాతినేని.. ఇద్దరూ ఎవరెవరి పరిధిలో వాళ్ళు తమలో గుంటూరును బ్రతికిస్తూనే ఉంటారు.


ఇది కూడా కాకుండా గుంటూరు మా స్కూలు గోడ నెర్రిలో మొలిచిన రావి చెట్టు వంటిది అని కూడా నా నమ్మకం. తన వేళ్ళను మెల్లమెల్లగా గోడ లోతుల్లోకి దించుతూ ఒక నిర్ణీత పధకం ప్రకారం ఒక నాటికి మా స్కూలును కూలగొట్టి ఇప్పుడు అదే ప్రదేశాన్ని రాగి చెట్టు సెంటర్ గా పిలిపించుకుంటున్న వలసవాదం మా గుంటూరుకు మొదటి నుండీ ఉందనీ, దీనికీ బ్రిటీషు వాళ్ళకూ ఏ సంబంధం లేదనీ కూడా నేను చతుర్కరణ శుద్దిగా నమ్ముతున్నాను (గుంటూరి జనాలకు మనసు, వాక్కు, కర్మ అనే త్రికరణాలకు అధనంగా గీర అనే మరొక కరణం ఉండి వుండవచ్చని కూడా ప్రజలు గుసగుసలాడుకుంటున్న దరిమెలా ఈ పదం వాడటం జరిగింది. ఇది నిజమేనని చదువరులు వ్యాసం పూర్తయ్యే లోపు గ్రహిస్తారనే సత్యాన్ని కూడా నేను ఎరుగినవాడను) గుంటూరు మనిషి ఎక్కడున్నా తన చుట్టు పక్కల ఉన్నా వ్యక్తుల్నీ, వ్యవస్థనూ మెల్లమెల్లగా ఆక్రమిస్తూ ఒకనాటికి వాటి అస్థిత్వ స్థానంలో గుంటూరు తనాన్ని నింపేస్తాడు అని దీని భావన. ఆ కారణంగానే ఎమేరికాలో ఉండే తెలుగు సంఘాలు కూడా ఫక్తు గుంటూరుతనంతో ప్రవర్తించడం మనం చూడవచ్చు.


ఏం.. ఎమేరికాలో ఉన్నాయి కదా... అక్కడి ఆలోచనా విధానంతో .. పరిపాలనా వ్యవస్థతో ఈ సంఘాలు ప్రవర్తించవచ్చు కదా అని మీరు అడగవచ్చు. నా సమాధానం ఒక్కటే..... ఎచ్చట గుంటూరు మనిషి ఉండునో అచ్చట గుంటూరిజమే సాధారణ ప్రవర్తనా శైలిగా చెలామణీ అయిపోవును. ఈ రకమైన మార్పు గుంటూరు ఆటోలకూ కలదని కూడా మనం ఒకడుగు ముదుకూ, పక్కకూ వేసి తీర్మానించేసుకోవచ్చు. అవి నడి రోడ్డులో నిలబడి సైడు తీసుకుని వెళ్ళండి అన్నట్టు చెయ్యి చాపి వేళ్ళను ముడుస్తూ తెరుస్తూ ఐదు సఖ్యను వేళ్ళతో చూపిస్తూ నిన్ను నిర్దేశిస్తాయి. నువ్వే రోడ్డు పక్కన ఆపుకోవచ్చు కదా అని అడిగే తెలివీ ధైర్యం ఎవడికీ ఉండవు. ఆసలు ఆ స్పృహే లేకుండా మిగతా వాహనాలన్నీ సిన్సియర్గా పక్కనుండి దారి చేసుకుని వెళ్ళిపోతాయి. ఇవాళ్ళ హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ప్రవర్తన పెచ్చు పెరగడానికి గుంటూరు నుండి వచ్చి సెటిల్ అయిన కూకట్పల్లి ఆటోలే కారణం అనే విషయం మీలో చాలా మందికి తెలియదు. హైదరాబాదుకు ఇప్పుడు గుంటూరు చేసింది (జలుబు చేసింది, వాతాం చేసింది.. అలాంటి ప్రయోగం అన్నమాట... సెబాస్).


అసలు గుంటూరు ప్రాచీన నామమైన గర్తపురి అనే పదం నుండే గర్తర- గత్తర అనే పదాలు కూడా వచ్చాయని నాలో మరొక వాదన ఉన్నా, అది మరీ మూఢనమ్మకంగా చదువరులు అర్ధం చేసుకుంటారో ఏమో అని కించిత్ అనుమానం కూడా నాలో లేకపోలేదు అన్న మాట నిజం.


guntur-special
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లేడీనే పెళ్లి చేసుకున్న లేడీ క్రికెటర్.. ఇప్పుడు 3 నెలల గర్భం..?
కైపెక్కించే అందగత్తె  కోసం.. కొట్టుకుచచ్చిన అన్నదమ్ములు..!
ఈ యాప్ లు మీ ఫోన్‌లో ఉంటే.. అర్జంట్‌ గా డెలీట్ చేయండి..!
పాకిస్తాన్‌ పై భూతల యుద్ధానికి భారత్ సిద్దపడిందా...?
అజయ్‌ ఆ మూవీతో బాక్సీఫీస్‌ ను "ఫుట్ బాల్" ఆడేస్తాడా..?
ఆ ఒక్క పని చేస్తే చాలు.. బాబు ఇల్లు ఎప్పుడో మునిగేది..?
జగన్ అమెరికాలో ఉన్నా.. మనసంతా అక్కడే ఉందట..!
కరకట్ట ఇంటి నుంచి చంద్రబాబు పరార్.. అందుకేనా..?
వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో జగన్ ! : రుణం కోసమేనా ?
జగన్ ఆ తప్పు.. దిద్దుకోబోతున్నాడా..?
ఈ సినిమా.. మరో 'ఎవరు' అయ్యేలా ఉందే.. ?
చిరంజీవికి తన కెరీర్‌లో బా... గా...  నచ్చిన సినిమా అదేనట..?
ఆ తెదేపా నేత.. ఎందుకు అందరి ముందు కన్నీరు పెట్టుకున్నాడు...?
మీకు 40 ఏళ్లా..? ఇది తప్పకుండా చదవండి..!
మునిగిపోతున్న బాబు ఇల్లు కాదు.. చూడాల్సింది ఇదీ..?
సాహో తర్వాత సుజీత్  ఫ్యూచర్  ఏంటి..? తలచుకుంటేనే..?
జగన్.. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ సూపర్ హిట్..?
బాలికను రోడ్డుపై పడుకోబెట్టి.. ఇద్దరు అదిమిపట్టి.. ఇంత దారుణమా..?
రాజమౌళికి 15 ఏళ్లు పడితే.. సుజీత్  రెండేళ్లకే .. గ్రేట్ ..?
షాకింగ్ : సాహో కోసం .. వాళ్లు రూ. 100 కోట్లు వదులుకున్నారా..?
అమెరికాలో చదివినా.. మాస్ పల్స్ పట్టేశారు.. హిట్ కొట్టేశారు !
ఇన్నాళ్లూ.. ఈ హీరోయిన్ ని ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదా..?
చంద్రబాబుపై ఆయన క్లోజ్ ఫ్రెండ్ సంచలన ఆరోపణలు..?
వెంకటేశ్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్..!
పవన్ కల్యాణ్.. టీడీపీ తోక పార్టీగానే గుర్తింపు కోరుకుంటున్నారా..?
రాజధానిని ఇడుపుల పాయకు..? అమరావతిని ముంచింది అందుకా..?
జగన్ అమెరికా చుట్టూ.. మంత్రులు నా ఇంటి చుట్టూ..!
ఇలా చేస్తే.. దెయ్యం పరార్..?
రూ.1 కే  బీమా.. ఆగస్టు 21 ఆఖరు తేదీ.. త్వరపడండి..!
పాపం.. శర్వా.. రణరంగం కోసం ఎన్ని తిప్పలో..?
పెళ్లి వేడుకలో దారుణం.. 40 మంది దుర్మరణం..!
కశ్మీర్ అంశం: మరోసారి గంగలో కలసిన చైనా పరువు..?
టెన్త్ పరీక్షల విధానం..  పూర్తిగా మారిపోతోందా...?
హిందూ ఆలయాల్లో.. ఇతర మతస్తుల పెత్తనమా..?
ఉత్తరం దిక్కు తల పెట్టి నిద్రపోకూడదా ..? ఎందుకు ?
కేసీఆర్ ను ఈ ఇష్యూతో బీజేపీ ఇరుకున పెడుతుందా...?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..