జగన్ సర్కారుపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తనను సరిగ్గా మాట్లాడనివ్వడం లేదంటూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో జగన్ సర్కారు వైఖరిపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.


జగన్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉందంటూ చంద్రబాబు విమర్శించడం వివాదాస్పదం అవుతోంది. పాలనలో లోటు పాట్లపై విమర్శలు చేయడం సహజమే అయినా పిచ్చోడి చేతిలో రాయి అనే పద ప్రయోగం చంద్రబాబు స్థాయికి తగినట్టు లేదు. అయితే చంద్రబాబు అంత మాట అసెంబ్లీలో అని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో.


అసెంబ్లీలో టీడీపీ బలం కేవలం 23, వైసీపీ బలం 151.. అదే మాట చంద్రబాబు అసెంబ్లీలో అని ఉంటే.. రచ్చ రచ్చ జరిగి ఉండేది. బహుశా అందుకనే చంద్రబాబు అంతమాట అసెంబ్లీలో అనే సాహసం చేసినట్టు లేరు.


బయట ప్రెస్ మీట్ కాబట్టి తాను ఏది మాట్లాడినా ఇబ్బంది ఉండని చంద్రబాబు భావించినట్టున్నారు. అయినా.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను ఇష్టం వచ్చినట్లు చేసుకుని ప్రజాధనం పెద్ద ఎత్తున వృథా అయ్యేటట్లు చేసిన చంద్రబాబు.. వ్యయం తగ్గిస్తానంటున్న జగన్ ను పిచ్చోడిగా జమకట్టడం విడ్డూరమే.


మరింత సమాచారం తెలుసుకోండి: