చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన పించన్ పథకాన్ని ప్రకటించింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారంతా ఈ పింఛన్ స్కీమ్ లో చేరవచ్చు. రూ.1.5 కోట్లలోపు వార్షిక వ్యాపార టర్నోవర్‌ ఉంటే చాలు ఇందులో చేరేందుకు అర్హులవుతారు.


సొంతంగా వ్యాపారాలు చేస్తున్నవారు, దుకాణ యజమానులు, రిటైల్‌ వ్యాపారులు, రైస్‌మిల్లు, ఆయిల్‌ మిల్లు, వర్క్‌షాప్‌ ఓనర్లు, కమీషన్‌ ఏజెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, చిన్నచిన్న హోటల్‌, రెస్టారెంట్ల యజమానులు, ఇతర చిన్న వ్యాపారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. వ్యాపారి నెల నెలా 55 రూపాయల నుంచి గరిష్టంగా.. 200 చెల్లించాలి. 18 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.


వ్యాపారి చెల్లించే చందాకు సమానంగా కేంద్రం కూడా పింఛను నిధికి జమ చేస్తుంది. సదరు వ్యాపారి కి 60 ఏళ్ల నుంచి అతను జీవించి ఉన్నంత కాలం నెలకు రూ.3వేల పింఛను అందుకోవచ్చు. వ్యాపారి చనిపోయిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా సగం ఫించన్ అందిస్తారు.


ఎవరైనా కొన్నాళ్లు చెల్లించి మధ్యలో ఆపేసిన వ్యక్తులు మళ్లీ దాన్ని కొనసాగించాలనుకుంటే పాతబకాయిలను, వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీ నేతృత్వంలో పింఛను నిధిని ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 3.50 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో ఆసక్తిగలవారు పేర్లు నమోదు చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: