చంద్రబాబునాయుడు బిసిల ద్రోహా ? జగన్మోహన్ రెడ్డి మాటలు వింటుంటే ఇపుడందరికీ అదే సందేహాలు వస్తున్నాయి. అసెంబ్లీలో బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి కొన్ని బిల్లులు ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లులు ప్రవేశపెట్టకుండా చంద్రబాబునాయుడు అండ్ కో తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే సంఖ్యాబలం రీత్యా చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదనుకోండి అది వేరే సంగతి.

 

శాస్వత ప్రాతిపదికన బిసి కమీషన్ నియమించే బిల్లు, పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 కేటాయింపు, నామినేటెడె వర్కుల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 50 శాతం కేటాయించాలనే బిల్లులను అధికార పార్టీ ప్రవేశపెట్టింది. పై వర్గాలకు మంచి జరగాలని, అభివృద్ధిలోకి రావాలనే కదా ఇంతకాలం చంద్రబాబు కూడా చెప్పింది ? మరి అదే పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం రూపంలో చేస్తానంటుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది ?

 

ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్ ప్రవేశపెట్టిన బిల్లులను చంద్రబాబు రాజకీయ కోణంలో మాత్రమే చూశారు. ఈ బిల్లులు పాసైతే బహుశా పై వర్గాలన్నీ జగన్ తో నే శాస్వతంగానే ఉండిపోతాయనే భయం చంద్రబాబు అండ్ కోలో మొదలైనట్లే కనబడుతోంది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన బిల్లులను తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. సరే అసెంబ్లీలో సంఖ్య రీత్యా చంద్రబాబు ఏమీ చేయలేకపోయారనుకోండి అది వేరే సంగతి.

 

చంద్రబాబు ప్రయత్నాలు చూసిన తర్వాతే జగన్ మండిపడ్డారు. చంద్రబాబును బిసిల ద్రోహిగా ముద్రవేశారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు తమ ప్రభుత్వం మంచి చేద్దామని చేసిన ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకోవటం ఏమిటంటూ మండిపోయారు. మొత్తం మీద పై వర్గాలకు మంచి జరిగే బిల్లులకు చట్టం రూపం ఇవ్వటంలో భాగంగా చంద్రబాబు బిసిల ద్రోహిగా ముద్రవేసినట్లే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: