ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రాష్ర్టంలో అన్ని రంగాల్లో ఉన్న మహిళలకు చేయూతనిచ్చేందుకు కీలకమైన బిల్లును ప్రతిపాదించగా అందుకు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో సభలో బిల్లుకు డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి పాస్ చేశారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు, మహిళలకు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మేలు చేస్తూ రూపొందించిన కీలకమైన బిల్లులు అసెంబ్లీ ఆమోదంతో చట్టరూపం దాల్చాయి.

ఈ బిల్లు వలన ఆయా వర్ఘాల మహిళలకు సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తూ తీసుకువచ్చిన చరిత్రాత్మక మహిళా సాధికారిత బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జనాభాలో సగం ఉన్న మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం అన్ని కార్పొరేషన్లు, సొసైటీ పదవుల్లో, బోర్డులు, కమిటీల చైర్‌పర్సన్‌ పదవుల్లో మహిళలకు సగం పదవులు దక్కనున్నాయి.

సామాజికంగా వెనుకబడిన రంగాల్లో ఉన్న బీసీలకు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన శాశ్వత ప్రతిపాదికన బీసీ కమీషన్ ఏర్పాటు బిల్లు సైతం ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వర్క్‌, సర్వీస్‌ కాంట్రాక్టుల్లోనూ ఈమేరకు 50శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: