ఏపీ అసెంబ్లీలో ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై నారా లోకేశ్ భలే గా స్పందించారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు మోసుకొస్తున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకుని.. వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే.. రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ.. ! అనికామెంట్ పెట్టారు.


అవును మరి పాపం.. లోకేశ్ కు అసెంబ్లీ కొత్త కదా.. అందుకే అసెంబ్లీ రూల్స్ గురించి సరిగ్గా తెలిసినట్టు లేదు. సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బయటకు వెళ్లిపోవాలి.లేకుంటే మార్షల్స్ తరలిస్తారు.


ఇది అసెంబ్లీ నిబంధనలు.. ఇవి కొత్తగా పెట్టినవేమీ కాదు.. గతంలో తెలుగుదేశం హయాంలో ఇలా ఎన్నోసార్లు జరిగాయి కూడా. కానీ.. ఇదేదో ఇప్పుడే జరిగినట్టు.. లోకేశ్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు.. ఆయన అవగాహన స్థాయిని తెలుపుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.


ప్రజల తరపున పోరాడడం అంటే పాత క్లిప్పింగ్ తీసుకుని వచ్చి అసత్యాలు ప్రచారం చేయడమా అని వైసీపీ సభ్యులు నిలదీస్తున్నారు. అంతేకాదు.. 1995 లో పార్టీని స్థాపించిన ఎన్.టి.రామారావునే శాసనసభలో మాట్లాడనివ్వని ఘట్టం లోకేష్ కు తెలియకపోవచ్చని గతం గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: