తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల ట్విట్టర్లో తెగ రెచ్చిపోతున్నారు. జగన్ సర్కారుపై వరుసగా ట్వీట్లు పెడుతూ సందడి చేస్తున్నారు. మీడియా ముందుకు రావాలంటే ఎందుకో వెనుకాడుతున్న నారా లోకేశ్ ట్వీట్ల విషయంలో మాత్రం తగ్గడం లేదు.


తాజాగా.. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో జగన్ పై వ్యంగ్యంగా లోకేశ్ ట్వీట్లు పెట్టారు... జగన్ కసి తనకు చాలా నచ్చిందంటూ సెటైర్లు వేశారు..


“ జగన్ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ ఎన్‌టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా. అందుకే ఈ లెటర్ రాసారు. తెదేపా హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని, నాటి మార్కెట్ ధరల కంటే తక్కువకే కొనుగోలు ధరలు నిర్ణయించామని రాసారు.”


"బిడ్ల ఎంపిక విధానాన్ని జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా ప్రశంసించిందని రాసారు. ఏంటో! మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయకుండా ఏపీలో కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి."


ఇలా వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు లోకేశ్. అయితే విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి రేట్లు తగ్గిస్తే తెలుగుదేశానికి వచ్చిన నష్టమేంటో మాత్రం లోకేశ్ ఎక్కడా ప్రస్తావించలేదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: