కేసీఆర్.. మాటతోనే మంత్రం వేయగల నాయకుడు.. వాగ్ధాటితో అవతలి పక్షాన్ని తుత్తునియలు చేయగల సమర్థుడు. అభ్యంతరకమైన భాషనైనా అవలీలగా పలికించి సామాన్యులను అలరించగల ఘనాపాఠి.


చవటలు, దద్దమ్మలు, సన్నాసులు.. ఇలాంటి తిట్లను సైతం అత్యంత సహజంగా ప్రత్యర్థులపై ప్రయోగించగల నిపుణుడు కేసీఆర్.. ఇప్పుడు ఇప్పుడు నారా లోకేశ్ నోట కూడా కేసీఆర్ మార్కు డైలాగులు వస్తున్నాయి. కేసీఆర్ లా వాగ్దాటి లేకపోయినా ట్విట్టర్ వేదికగా ఇదే తరహాలో డైలాగులు వదులుతున్నారు చిన్నరాజావారు.


ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారపక్ష సభ్యులు నానా యాగీ చేస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రసంగ వీడియోను పోస్ట్ చేశారు.


మొత్తానికి నారా లోకేశ్ కూడా కేసీఆర్ బాటలో మాటల్లో డోసు పెంచుతున్నారనన్నమాట. కానీ ఆ డైలాగులు కేసీఆర్ కు సహజ ఆభరణాలుగా మారాయి. మరి లోకేశ్ కు ఎలా సూటవుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: