వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 40 రోజులు అవుతోంది. మళ్లీ తమదే అధికారం అని ఆశపడిన తెలుగుదేశం నేతలు వైఎస్ జగన్ ను సీఎంగా చూడటం చాలా కష్టం కలిగించింది. పాపం.. కొందరైతే ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


అంతే కాదు.. ఆ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇదే విషయం చెబుతున్నారు. జగన్ ను అసెంబ్లీలో సీఎం హోదాలో చూడటం దురదృష్టకరమంటున్నారు.


పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు నడయాడిన సభలో జగన్ లాంటి వ్యక్తులను చూడటం దురదృష్టకరమని ఆలపాటి రాజా అంటున్నారు.సభ్యులను అగౌరవ పరిచేందుకో, కక్షలు, కార్పణ్యాలకో అసెంబ్లీ వేదిక కాకూడదని రాజా జగన్ కు హితవు పలికారు.


ప్రజల పక్షాన నిలిచే నేతల గొంతు నొక్కడం దౌర్భాగ్యమని రాజా చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చిన జగన్.. ఇప్పుడు వాటికి షరతులు విధిస్తున్నారని విమర్శించారు ఆలపాటి రాజా.


మరింత సమాచారం తెలుసుకోండి: