దేశంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల్లో చంద్రబాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ మరణం తరువాత 23 ఏళ్లుగా చంద్రబాబు టీడీపీని అధ్యక్షుడి హోదాలో అప్రహతిహతంగా నడిపిస్తున్నారు. ఈ 23 ఏళ్లలో 14 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సేవలందించారు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు పొందారు. కానీ ఈ మధ్య ఆయన రాజకీయ పరిణితిపై కొన్ని సందేహాలు వస్తున్నాయి.

 

ఇటివల ఏపీ ఎన్నికలు జరిగి టీడీపీ ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు మే ‘23’న వచ్చాయి. ఫలితాల్లో టీడీపీకి ‘23’ సీట్లు వచ్చాయి. టీడీపీ అధికారంలో ఉండగా వలసలను ప్రోత్సహించి వైసీపీకి చెందిన ‘23’ మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో ఈ అంశం హైలైట్ అయింది. మా పార్టీ నుంచి ‘23’ మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకున్నందుకు ఆయనకు ఈ ఎన్నికల్లో అదే ‘23’ మంది ఎమ్మెల్యేలు మిగిలారని సీఎం జగన్ పలుమార్లు అన్నారు. గతేడాది కర్ణాటక రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కుమారస్వామి అండగా నిలిచి ఆయన సీఎం కావడానికి సహకరించి దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు. బలనిరూపణలో 14 నెలల అనంతరం జూలై ‘23’ న ఆ మైనార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. అది కూడా ‘23’ వ తేదీనే.

 

‘23’ ఏళ్లుగా టీడీపీ అధ్యక్షుడు, అధికారంలో ఉండగా ‘23’ మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం, ఈ ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలవడం, తాను సపోర్ట్ చేసిన కర్ణాటక ప్రభుత్వం ‘23’ వ తేదీనే పడిపోవడం.. ఇవన్నీ యాధృచ్చిక సంఘటనలే. కానీ.. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు “23” సంఖ్య గండం పట్టుకున్నట్టుంది. దీనిపై టీడీపీ శ్రేణులు, చంద్రబాబు ఓ లుక్కేస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: