అతి తక్కువ కాలంలో వైఎస్ జగన్ ఐదు కీలకమైన బిల్లును ఆమోదింపజేశారు. బలహీనవర్గాల శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు కాంట్రాక్టుల్లో, నామినేషన్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల రిజర్వేషన్ అమలు చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.


ఇవన్నీ చాలా ప్రాధాన్యం ఉన్న బిల్లులే. వీటిలో చంద్రబాబు సర్కారు ఏ ఒక్కటి చేసి ఉన్నా.. ఎల్లో మీడియా ఆహా.. ఓహో.. అంటూ కీర్తించేంది. తమ మీడియాలో చంద్రబాబు అభినవ అంబేద్కర్ అంటూ ప్రత్యేక కథనాలు, ప్రోగ్రాములు చేసేది.


అలాంటిది ఏకంగా ఐదు బిల్లులు ఆమోదింపజేసినా.. ఇప్పుడు ఆ ఎల్లో మీడియాలో హడావిడి కనిపంచడం లేదు. సరికదా... పింఛన్లపై తెలుగుదేశం చేస్తున్న ఆందోళనలను హైలెట్ చేస్తూ ఈ బిల్లుల గొప్పదనం ప్రజలకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి.


ఐతే.. ఎల్లో మీడియా చెబితేనే వీటి గొప్పదనం తెలుసుకోలేని పరిస్థితుల్లో జనం లేరు. సోషల్ మీడియా, ఇతర సాధనాల ద్వారా ప్రజలకు వెళ్లాల్సిన సమాచారం వెళ్తూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: